ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రాజెక్టులతో పాటు లోతట్టు ప్రాంతాలు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే మినహా మూడు రోజుల పాటు ప్రజాలేవరు బయటకు రావొద్దని సూచిస్తున్నారు జిల్లా అధికారులు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ ఫాల్స్, ప్రాజెక్టుల వద్ద పోలీసు ఆంక్షలు సైతం కొనసాగుతాయనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు..