కర్నూలు నగరంలోని పాత బస్తి జమీయా మసీదు వద్ద పార్కులో మందుబాబులకు నిలయంగా మారిందని సిపిఎం పార్టీ కర్నూలు నగర కార్యదర్శి వర్గ సభ్యులు షరీఫ్ అబ్దుల్లా అన్నారు. గురువారం ఉదయం 12 గంటలకు ఆ పార్కులో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కు పక్కనే మసీదు కళాశాల ఉందని ఇక్కడ మద్యం సేవిస్తూ పార్క్ లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పార్కులో ఉన్న ఆటస్థలా వస్తువులను ధ్వంసం అయినట్లు వారు తెలిపారు తక్షణమే ఈ పార్కుపై మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.