తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు అయిన బుధవారం రథోత్సవం వైభవపీతంగా సాగింది ఆలయం వద్ద ఉన్న అలంకార మండపం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను రథంపై కొలువు తీర్చారు అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేసి రథోత్సవాన్ని నిర్వహించారు బ్రహ్మరథం పై కొలువు దీరిన బ్రహ్మాండనాయకుని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు.