ప్రకాశం జిల్లా బెస్తవారిపేట, కంభం మండలాల పరిధిలోని దర్గా గ్రామ పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రెండు రోజుల క్రితం కంభం మండలంలోని దర్గా గ్రామంలో కనిపించిన పెద్దపులి కొంత భాగం దర్గా గ్రామం బేస్తవారిపేట మండలంలో కూడా ఉంది. అయితే ఆ పరిసర ప్రాంతాలలో కూడా పెద్దపులి సంచరిస్తున్నట్లుగా అధికారులు అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదివారం ప్రజలకు తెలిపారు. పులి కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అతి త్వరలో పులుల సంచారం పై సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.