గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ పొలాల్లో కేబుల్ వైర్లు, మోటార్లను ఎత్తుకెళుతున్న దొంగలను రైతులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగస్వామి, కుళ్లాయప్ప పొలాల్లో ఇద్దరు దొంగలు కేబుల్ వైర్లను, మోటార్లను ఎత్తుకెళ్లినట్లు రైతులు గమనించారు. వెంటనే వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మంగళవారం రాత్రి దొంగలను పోలీసులుకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గత రెండు నెలలుగా దొంగలు వ్యవసాయ పొలాల్లోని పరికరాలను ఎత్తుకెళుతున్నారన్నారు.