వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ నాగజ్యోతి అన్నారు. నేడు శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు తాడ్వాయి మండలం ఊరటం, కన్నేపల్లి, నార్లాపూర్ గ్రామాల్లో నష్టపోయిన పొలాలను ఆమె పరిశీలించారు. నాగజ్యోతి మాట్లాడుతూ.. వందల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇసుకమేటలు ఉన్నాయని, అధికారులు నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలన్నారు. ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు.