విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక ఏఐ టూల్స్ పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం లోని వంటగది, స్టోర్ రూము, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజు అందిస్తున్న భోజన, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు చుట్టూ అపరిశుభ్రత, రహదారి, విద్యాలయం భవనానికి ప్రహరీ లేనట్లు గమనించారు. విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డు, ప