సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గణనాథులు గంగమ్మ ఒడికి ప్రశాంతంగా చేరుకున్నారు. గత 11 రోజుల క్రితం నెలకొల్పిన వినాయక విగ్రహాలను శనివారం రాత్రి అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించి ఆదివారం ఉదయం కొత్తూరు నారింజ ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ తలెత్తకుండా డి.ఎస్.పి సైదా, సీఐ శివలింగం ఆధ్వర్యంలో పోలీసులు ప్రతిష్ట భద్రత చేపట్టారు. కొత్తూరు నారింజ ప్రాజెక్టులో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు 102 గణనాథులు నిమజ్జనం అయినట్లు అధికారులు తెలిపారు.