నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. ఈ సందర్భంగా డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.90 అడుగుల వద్ద ఉండన్నారు. దీంతో డ్యాం అధికారులు 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 267132 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 267,132 క్యూసెక్కులుగా ఉందని అన్నారు.