అనంతపురం జిల్లా గార్లదిన్నె తాటిచెర్ల రైల్వే స్టేషన్ల సమీపంలో రైలు కిందపడి గార్లదిన్నె మండల కేంద్రంలోని దిగువగేరి కి చెందిన బోయ శివ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వీటికి సంబంధించి శనివారం ఉదయం రైల్వే ఎస్సై వెంకటేష్ వివరాలను వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించడం జరిగిందన్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.