బంజారాహిల్స్ లోని కేబిఆర్ పార్కు వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక కారు వేగంగా వచ్చి ఫుట్పాత్ పైకి వెళ్లి దూసుకెళ్లింది. ఒక ప్రహరీ గోడను ఢీకొట్టడంతో కారు ముందు భాగం ప్రహరీ కూడా ధ్వంసం అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.