గుమ్మలక్ష్మీపురం జూనియర్ కళాశాలలో శనివారం మద్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్వరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నతమైన విద్యతోపాటు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిందని, చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని అన్నారు. మండల కన్వీనర్ సుదర్శనరావు, కళాశాల సిబ్బంది, కూటమి నాయకులు కార్య కర్తలు ఉన్నారు.