తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంఈఓ కార్యాలయ ఆవరణలో శనివారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరయ్యారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ శ్రీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ముఖ్య కారణం గురువేనని తెలిపారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎన్నటికీ మరిచిపోకూడదన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.