పిట్లం లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు..... కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరిగాయి. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు భక్తులు పుట్టల వద్ద పాలు పోయడానికి బారులు తీరారు. పుట్టలో పాలు పోసి నాగ దేవతకు ముక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా మండల కేంద్రంలోని శివాలయాలు సాయంకాలం 6: 30 వరకు రద్దీగా ఉన్నాయి.ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.