పాణ్యం మండలం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వేల్పుల భాను ప్రకాష్ శనివారం రూమలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. కడప జిల్లా లింగాల మండలం తాటిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరిన్ని పూర్తి వివరములు తెలియవలసి ఉంది.