ఆడపిల్లలు చెదివితే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మక్తల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు బాలికల గురుకుల పాఠశాలను గురువారం 11 గంటల సమయంలో తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ రికార్డులు స్టాక్ రూమ్ వంటగది మరుగుదొడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు వాడాలని అన్నారు. పాఠశాల నిర్వహణ రికార్డులు స్టాక్ రూమ్ వంటగది మరుగుదొడ్లు తదితర వాటిని పరిశీలించారు. పాఠశాలల్లో బోధన విషయంలో ఉపాధ్యాయులు సబ్జెక్టు వైస్ గా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు.