Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన రేషన్ డీలర్లు

Mancherial, Mancherial | Aug 25, 2025
కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, కమీషన్‌ పెంచాలని, పెండింగ్ లో ఉన్న కమిషన్ నిధులు విడుదల చేయాలని మంచిర్యాల రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ ఎదుట రేషన్‌ డీలర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ నెల కమీషన్‌ ఆ నెలలోనే చెల్లించాలని, గౌరవ వేతనం ఐదు వేలు పెంచాలని, ఐదు నెలల బియ్యం కమీషన్‌ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us