సిద్దిపేట జిల్లా గజ్వేల్ బిజెపిలో ప్రోటోకాల్ రగడ జరిగింది. శుక్రవారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన జీఎస్టీ పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో స్వాగత ఫ్లెక్సీలలో మండల అధ్యక్షుడు ఫోటో లేదంటూ గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బిజెపి కార్యకర్తలు చించి వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.