ఆసిఫాబాద్ పట్టణంలోని గుండి లింక్ రోడ్డు గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని CPM పార్టీ మండల ఇంచార్జీ కార్తీక్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..ASF జిల్లా కేంద్రం నుంచి గుండి, గోవింద్ పూర్,గురుగురీ గ్రామాలకు ఈ గుంతలమయం దారి నుండి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. DBL గుత్తేదారులు ఈ లింక్ రోడ్డును వేయకుండా వదిలేసివెళ్లిపోయారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు.