వీణవంక: మండలంలోని పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజరాబాద్ ఏసిపి మాధవి తెలిపిన వివరాల ప్రకారం కోర్కల్ గ్రామానికి చెందిన కొలీపాక రవి అనే వ్యక్తి మహారాష్ట్రలో పేకాటతో జలసాలకు అలవాటు పడి చైన్స్ స్నాచింగ్ పాల్పడుతూ 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులను ఎంచుకొని అదును చూసి దొంగతనానికి పాల్పడేవాడని. మండలంలోని కోర్కల్ దేశాయిపల్లి చల్లూరు, అన్నారం కొత్తపల్లి గ్రామాల్లో 14 తులాల బంగారం దోచుకున్నాడని అన్నారు. రవిని అరెస్టు చేసి డిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఏసిపి మాధవి అభినందించారు.