ఈనెల 15న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 10 కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడల మంత్రి శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈనెల 15న కామారెడ్డి లో జరిగే బీసీ డిక్లరేషన్ సభ వాతావరణం అనుకూలించక వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసిన పాదయాత్రలో సామాన్యుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేశామని తెలిపారు.