మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులను తొలగించే ప్రయత్నాలు మానుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. నేడు బుధవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు ములుగు జిల్లా కేంద్రలోని DEO కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో వంట కార్మికులు జరిపిన అనేక పోరాటాలలో నేటి శాసనసభ్యులు, మంత్రులు, స్వయంగా ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారని, ఆ సందర్భంలో భరోసా కల్పించడంతో పాటు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.10 వేల వేతనాలు చెల్లిస్తామని ఎవ్వరినీ తొలగించకుండా జీఓ విడుదల చేస్తామ