దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తిపై పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోన్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆదివారం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలను పరాశక్తిగా కొలిచే దేశంలో ప్రధాని తల్లిని దూషించడం రాహుల్ గాంధీ సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, నాయకులు రాచకొండ సాగర్, నరేష్, రాము, రాజేష్, సాయినాథ్, మల్లన్న, అమృత్, బక్కన్న, వెంకట నరసయ్య, సత్యం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.