నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొనేటమ్మ పల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక కాటం సుధాకర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కాటం సుధాకర్ అనే రైతు2020 నుండి దాదాపు 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు, పంటలు పండక చేసిన అప్పుల బాధ తాళలేక శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.