గణేష్ ఉత్సవాలలో DJ సౌండ్ బాక్సులు, అసభ్యకర నృత్యాలు పెడితే చర్యలు తీసుకుంటామని బొబ్బిలి DSP జి.భవ్య రెడ్డి హెచ్చరించారు. వినాయక ఉత్సవాలపై సోమవారం బొబ్బిలిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. చవితి ఉత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వీడియోలో వివరించారు.