నిన్న అనగా 11 వ తేదీ గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డివైడర్ మీద సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కొత్తపేట సీఐ వీరయ్య శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. డివైడర్ మీద పడుకున్న వ్యక్తి చనిపోయి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. కావున మృతుడు ఆచూకీ తెలిసినవారు స్థానిక కొత్తపేట పోలీసులను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.