మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురష్కరించుకుని రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో ఉన్న మస్జిదే అహ్మద్ రజా వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి ముస్లింల యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తం ఎంతో అవసరం ఉంటుందని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం పై మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. దాతలను అభినందించారు.