ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.. 8వ తరగతి: 3 సీట్లు,9వ తరగతి: 4 సీట్లు 10వ తరగతి: 1 సీటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (MEC): 12 సీట్లు ఉన్నాయని తెలిపారు.