కలుపు మందు తాగి ఆశా వర్కర్ మృతి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ నగర్ కు చెందిన జొన్నలగడ్డ వెంకటమ్మ (35)అయ్యగారిపేట పరిధిలో ఆశా వర్కర్ గా పనిచేస్తున్నారు.గత నెల 24న మనస్థాపానికి గురై కలుపు మందు తాగిన ఆమె,మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి తరలించబడ్డారు.అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.ఈ సంఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.