ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు సిండికేట్ గా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని KVPS జిల్లా కార్యదర్శి దినకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..మెడికల్ షాపులో ఫార్మాసిస్ట్ తప్పని సరిగా ఉండాలి.కానీ అక్కడ ఫార్మాసిస్ట్ లేకుండానే మెడికల్ దుకాణాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడికల్ నిర్వాహకులకు అర్థంకాక గతంలో అనారోగ్య పాలైన సంఘటన జిల్లాలో ఉన్నాయన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ నామమాత్రపు మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.