ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెంలో ఓ కోతి మరణించింది. గత కొన్ని నెలలుగా గ్రామంలో తిరుగుతున్న కోతి అనారోగ్యంతో చనిపోయింది. గ్రామస్తులు డబ్బు వాయిద్యాలతో బాణాసంచా కాలుస్తూ కోతి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. గ్రామస్తులందరూ కలిసి కోతికి అంత్యక్రియలు పూర్తి చేశారు.