నారాయణఖేడ్ పట్టణంలో ఈనెల 16వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ తెలిపారు. నారాయణఖేడ్లో బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17న జన్మదిన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు అరుణ్ రాజ్, దశరథ్, రాజు నాయక్, రాజశేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.