పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో గేదెల కాపరి అంకమ్మరావు 60 సంవత్సరాలు నీటి కుంటలో పడి మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందం ఆయన మృతదేహాన్ని కుంటలో నుంచి బయటికి తీసింది. మంగళవారం సాయంత్రం గేదెలను మేతకు తోలుకెళ్తుండగా ప్రమాదవశాత్తు కుంటలో జారి పడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.