*దొంగల బీభత్సం...తాళం వేసిన ఇళ్లలో చోరీ* అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు శివాలయం వీధిలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బాధితుల వివరాల మేరకు రాజంపేట పట్టణం శివాలయం వీదికి చెందిన లక్ష్మీదేవి అనే వివాహిత వినాయక చవితి పండుగ రోజున తన తమ్ముడి దగ్గరికి నందలూరు కి కుటుంబ సభ్యులతో వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలకొట్టి రెండు చైన్లు, రెండు గాజులు, యాభై వేల నగదు ఎత్తుకెళ్లారు. అని శనివారం తిరిగి ఇంటికి వచ్చాక దొంగతనం జరిగినట్లు గమనించానని బాధ్యతరాలు తెలిపారు అదే వీధిలో ఇంకో ఇంట్లో దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు