ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. మన్సూర్ ఖాన్ పఠాన్ కు చెందిన గిఫ్ట్ డిడి విషయంలో డాక్యుమెంట్ రైటర్ ముదసిర్ వద్ద నుంచి రూ.5000 లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయి.