ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం రాగసముద్రం గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై విరవిహారం చేసింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. పెద్దవారు కాబట్టి చిన్న గాయాలతో సరిపోయింది అదే చిన్నపిల్లలయితే తీవ్ర ప్రమాదం జరిగేదని గ్రామస్తుల ఆరోపించారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు కుక్కలను అరికట్టాలని గ్రామస్తులు కోరారు.