ప్రకాశం జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సైకిల్ ర్యాలీకి పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఎ నాయకులు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఒంగోలు చేరుకున్నారు. ఆగస్టు 28 నుంచి ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గురువారం ఒంగోలుకు చేరుకోగా పెళ్లూరు వద్ద ఎస్ఎఫ్ఎ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఒంగోలు నగరంలో వారు ర్యాలీ నిర్వహించారు. వెంటనే జిల్లాలో విద్యారంగ సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులు యాత్ర విజయవంతమైనట్లుగా తెలిపారు.