వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం సోమందేపల్లి మండల వ్యాప్తంగా శనివారం జరుగనుందని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో వినాయక విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలని, శోభాయాత్రను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. దాదాపు 70 విగ్రహాలు ఏర్పాటు చేసినందున నిమజ్జనానికి సమయం పడుతుందని, కాబట్టి తొందరగా కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరారు.