నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. పట్టణంలో పలు వీధులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరివేక్షించారు. కరీముద్దీన్ కాలనీలో 68 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రహదారులు డ్రైన్ల, కరీం బాగ్ వీధిలో 60 లక్షలు జిఎం టాకీస్ వీధిలో 70 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైన్లను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.. పట్టణంలో పలుచోట్ల చెత్తాచెదారంతో విధులు అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్త