ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి 99933 39350 అనే వాట్సాప్ నంబర్ను మంగళవారం లాంచ్ చేశారు. 'మీ సమస్య ఏదైనా పై నంబరుకు ఫోన్ కాల్, మెసేజ్, వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. సమస్యలను నేను పరిష్కరిస్తా' అని తెలిపారు. ప్రజల కోసమే వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.