పుత్తూరులోని ఆరెటమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్థానిక పిల్లలు, పెద్దలు, మహిళలు ఉత్సాహంగా ఆటలు పోటీల్లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో వాతావరణం కోలాహలంగా మారింది. ఎవరి జీవితంలో వారు నిమగ్నమైపోతున్న సమాజంలో ఇలా అందరూ కలిసి సంతోషంగా ఆటల పాటలతో సరదాగా గడపామని అన్నారు.