పార్వతీపురం జీఆర్పీ పోలీసులు గురువారం వయవకుడి ప్రాణాలు కాపాడారు.పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ గేటు సమీపంలో ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్లు విధుల్లో ఉన్న జీఆర్పీ పోలీసులు గుర్తించారు. హెచ్ సీ రత్నకుమార్, కానిస్టేబుల్ దిలీప్ అక్కడ కు వెళ్లి ఆ వ్యక్తి ని కాపాడి వివరాలు సేకరించారు. జియమ్మవలస మండలం చినకుదమ గ్రామానికి చెందిన టొంప శ్రీకాంత్, తండ్రి సంఘమేష్ , మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని మనస్ధాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలిపారు. హెచ్ సీ రత్నకుమార్ యువకుడికి కౌన్సిలింగ్ చేసి తండ్రి కి అప్పగించారు.