ప్రైవేట్ షాపుల్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే ఫిర్యాదులు చేయాలి. రైతులు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి. ఎవరైనా అధిక రేటుకు కొనుగోలు చేసినట్లు సాక్ష్యాలు ఉంటే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం” అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదులకు 08561293006 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. రైతుల పేర్లు గోప్యంగా ఉంచుతామని, దుకాణాల లైసెన్సులు రద్దు చేసే వరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.