యాదాద్రి భువనగిరి జిల్లా: డ్రగ్స్ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని మోత్కూర్ సిఐ వెంకటేశ్వర్లు బుధవారం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మోత్కూరు పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డ్రగ్ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.