మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వ్యవసాయ కూలీలకు మూడు నెలలకు పైగా కూలీలు అందక జిల్లాలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిఆర్ఓ నరసింహులుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఆయన మాటలు తప్ప చేతలు లేవనేది అర్థమవుతుంది అని తెలిపారు జిల్లాలోని లక్షలాది మంది కూలీలు తమ అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.