కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. మండలంలో 40 మంది వివిధ అనారోగ్య కారణాలతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా రూ. 20 లక్షలకు పైగా మంజూరయ్యాయి. ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని అన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రామమునిరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు షబ్బీర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.