కోడుమూరు పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థులపై శుక్రవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేశాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో విద్యార్థులు భోజనం చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు గుంపుగా దాడి చేశాయి. ఈ ఘటంలో దాదాపు 112 మంది విద్యార్థులకు తేనెటీగలు కుట్టాయి. విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందరికీ చికిత్స జరిపించామని, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైద్యాధికారి నాగరాజు తెలిపారు. ముగ్గురు విద్యార్థులకు చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.