పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం శంబర గ్రామంలోని శ్రీ సత్య సాయి ట్రేడర్స్ ఫెర్టిలైజర్స్ పై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ప్రాంతీయ నిఘా అధికారి బి. ప్రసాద్ రావు ఆదేశాల మేరకు అధికారులు రామారావు, పురుషోత్తం తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. రైతులకు ఎక్కువ ధరలకు ఫెర్టిలైజర్స్ అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత ఫెర్టిలైజర్స్ అబ్బాయి కేసు నమోదు చేసి 2,399 బస్తాలు ఎరువులను సీట్ చేసినట్లు తెలిపారు.