పరిగి జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసి పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి ని ఆదివారం పరిగి పట్టణంలో అతని నివాసం వద్ద ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అతనిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఉపాధ్యాయ జీవితంలో నిబద్ధతతో పనిచేసే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించే విధంగా విద్యా బోధన అందించడం జరిగిందన్నారు. అతని విద్యా సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి,మార్కెట్ కమ