నిరుపేదలకు మెరుగైన వైద్య చికిత్స అందించే క్రమంలో ఉచితంగా సిటీ స్కాన్ సేవలు కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో రేపటినుండి అందుబాటులోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.ఆరోగ్య,వైద్య కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదగా మంగళవారం సాయంత్రం 4.30గంటలకు సిటీ స్కాన్ ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అదనపు కలెక్టర్ బెన్ష లోమ్ తో కలిసి దగ్గరుండి పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలను ఇచ్చారు.సిటీ స్కాన్ ప్రారంభోత్సవం సజావుగా జరగాలని అన్నారు.